అక్షరటుడే, నిజాంసాగర్ : Farmers | ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు farmers.. దానిని అమ్ముకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. వరి paddy కోతలు పూర్తయిన పలు గ్రామాల్లో ఇంకా ధాన్యం తూకాలు ప్రారంభం కాలేదు. నాయకులు కొబ్బరికాయ కొట్టి కేంద్రాలను ప్రారంభించినా.. హమాలీల hamalis కొరరతో కొనుగోళ్లు ప్రారంభం కాక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం వద్ద రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నారు.
Farmers | బీహార్ నుంచి హమాలీలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏటా బీహార్ bihar నుంచి హమాలీలను తీసుకు వస్తారు. అయితే పలు గ్రామాలకు ఇంకా హమాలీలు రాకపోవడంతో కాంటాలు చేయడం లేదు. నిజాంసాగర్ nizamsagar మండలం వడ్డేపల్లి, మహమ్మద్ నగర్ mahammad nagar మండలం నర్వ, మగ్దూంపూర్, తెల్గపూర్ గ్రామాలలో హమాలీలు లేక ధాన్యం కాంటా చేయడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నారు. స్థానిక హమాలీలు అందుబాటులో ఉన్నచోట కాంటాలు ప్రారంభించారు.
Farmers | నత్తనడకన..
ఎల్లారెడ్డి yellareddy, కామారెడ్డి kamareddy నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే చాలా గ్రామాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తక్కువ మంది హమాలీలు ఉండటం, లారీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కోతలు ముందుగా ప్రారంభం కావడంతో అక్కడ ధాన్యం సేకరణ కూడా ముందే మొదలు పెట్టారు.
Farmers | సౌకర్యాలు కరువు
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. నీడ కోసం టెంట్ వేయకపోవడంతో రైతులు చెట్ల కింద సేద తీరుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు భయపెడుతుండటంతో వేగంగా ధాన్యం కాంటాలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇబ్బందులు లేకుండా చూడాలి
– కొర్ర రమేష్, రైతు, వడ్డేపల్లి

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి. రెండు వారాలుగా తూకాలు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు హమాలీలు వచ్చారు. కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు కూడా లేవు. కేంద్రాల్లో వసతులు కల్పించి, వేగంగా ధాన్యం కాంటా చేయాలి.
కాంటాలు ప్రారంభించాలి
– శీలం సాయిలు రైతు, మగ్దూంపూర్

హమాలీల కొరతతో ప్రాంతాల్లో కాంటాలు మందకొడిగా సాగుతున్నాయి. హమాలీలు లేక మా ఊరిలో అయితే ఇప్పటి వరకు ధాన్యం సేకరణ ప్రారంభించలేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
రెండు రోజుల్లో ప్రారంభిస్తాం..
– వాజిద్ అలీ, గున్కుల్ సొసైటీ ఛైర్మన్
మగ్దూంపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో రెండు రోజుల్లో కాంటాలు ప్రారంభిస్తాం. నర్వ గ్రామంలో ఇప్పుడిప్పుడే వరికోతలు ప్రారంభిచండంతో తూకాలు ప్రారంభించలేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.