అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు.
కలెక్టరేట్లో (Collectorate Nizamabad) సోమవారం సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా మాన్యువల్ స్కావెంజర్స్ (Manual scavengers) లేరని 1993 నిషేధ చట్టం పకడ్బందీగా అమలవుతుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ (District Social Welfare Department) అధికారి రజిత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.
సఫాయి కర్మచార్యులు, పారిశుధ్య కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు అర్హులైన వారి పిల్లలకు ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్స్ (Pre-Matric Scholarships) అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రవిబాబు, సీపీవో రతన్, తదితరులు పాల్గొన్నారు.