ePaper
More
    Homeబిజినెస్​Stock Market | దూసుకుపోయిన ఐటీ స్టాక్స్‌.. లాభాల బాటలో సూచీలు

    Stock Market | దూసుకుపోయిన ఐటీ స్టాక్స్‌.. లాభాల బాటలో సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఐటీ స్టాక్స్‌ దూసుకుపోవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు  (Domestic stock markets) నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 195 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 137 పాయింట్లు తగ్గింది. తర్వాత పుంజుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 435 పాయింట్లు పెరిగింది. 79 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty).. అక్కడినుంచి 55 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 127 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్‌ (Sensex) 329 పాయింట్ల లాభంతో 81,635 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 24,967 వద్ద స్థిరపడ్డాయి.

    Stock Market | ఐటీ షేర్లలో జోరు..

    ఐటీ రంగానికి చెందిన షేర్లు దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(IT index) 2.35 శాతం పెరిగింది. రియాలిటీ ఇండెక్స్‌ 0.74 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.67 శాతం, ఆటో 0.51 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.42 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.41 శాతం లాభపడ్డాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.42 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.31 శాతం, టెలికాం ఇండెక్స్‌ 0.25 శాతం నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.37 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.10 శాతం పెరగ్గా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.02 శాతం నష్టంతో ముగిసింది.

    అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,948 కంపెనీలు లాభపడగా 2,237 స్టాక్స్‌ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 164 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ 3.03 శాతం, టీసీఎస్‌ 2.85 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.77 శాతం, టెక్‌ మహీంద్రా 1.32 శాతం, టాటా మోటార్స్‌ 0.95 శాతం లాభపడ్డాయి.

    Top Losers : బీఈఎల్‌ 0.76 శాతం, ఆసియా పెయింట్‌ 0.39 శాతం, ఎయిర్‌టెల్‌ 0.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.21 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.21 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this