ePaper
More
    Homeభక్తిSrisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. 20 నిమిషాలకో బస్సు

    Srisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. 20 నిమిషాలకో బస్సు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం కోసం వెళ్తుంటారు. తెలంగాణ నుంచి సైతం భారీగా భక్తులు శ్రీశైలం వెళ్తారు. ఈ క్రమంలో టీఎస్​ ఆర్టీసీ(TS RTC) భక్తులకు గుడ్​ న్యూస్​ చెప్పింది.

    శ్రీశైలం క్షేత్రానికి హైదరాబాద్​ మీదుగా భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ మేరకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Shamshabad Airport) నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

    Srisailam Temple | బోర్డింగ్​ పాయింట్​ ఏర్పాటు

    శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం శంషాబాద్​ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న క్రాస్ రోడ్డు దగ్గర కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విమానాశ్రయం నుంచి పుష్పక్ బస్సుల్లో బోర్డింగ్ పాయింట్ వరకు భక్తులు చేరుకోవచ్చు. అక్కడి నుంచి స్పెషల్​ బస్సు(Special Bus)ల్లో శ్రీశైలం వెళ్లొచ్చు. బోర్డింగ్​ పాయింట్​ నుంచి శ్రీశైలం ఆలయానికి 20 నిమిషాలకో బస్సు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సూపర్ లగ్జరీ, రాజధాని, ఏసీ బస్సులు ఏర్పాటు చేశారు.

    Srisailam Temple |భక్తులు వినియోగించుకోవాలి

    శంషాబాద్​ ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం ఆలయానికి(Srisailam Temple) వెళ్లే భక్తులు ఆర్టీసీ వెబ్​సైట్​ ద్వారా ముందుగా టికెట్​ బుక్​ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్  బోర్డింగ్ పాయింట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మల్లికార్జున స్వామి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది. కాగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి(Srisailam Mallanna Temple) ఇప్పటికే ఆర్టీసీ పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే భక్తుల రద్దీ ఉండే ఆలయాలకు నిత్యం బస్సులు నడుపుతుండటంతో పాటు స్పెషల్​ టూర్​ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆలయాల సందర్శనకు వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this