అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bank Jobs | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local bank officer) పోస్టుల భర్తీ కోసం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(Punjab and sind bank) చర్యలు చేపట్టింది. 750 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 750.
Bank Jobs | రాష్ట్రాలవారీగా ఖాళీలు..
- మహారాష్ట్ర- 100
- గుజరాత్- 100
- ఒడిశా- 85
- తమిళనాడు- 85
- ఆంధ్రప్రదేశ్- 80
- కర్ణాటక- 65
- పంజాబ్- 60
- తెలంగాణ- 50
- ఛత్తీస్‌ఘడ్- 40
- జార్ఖండ్- 35
- హిమాచల్‌ప్రదేశ్- 30
- అసోం- 15
- పాండిచ్చెరి- 05
- విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ(Any degree) పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి : 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- వేతనం : నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.
- దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 4.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
- ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://punjabandsindbank.co.in/ లో సంప్రదించండి.