అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | ప్రొఫెసర్ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఆయనను చట్ట సభకు పంపుతామని, ఎవరు అడ్డం వస్తారో చూస్తానన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం (Kodandaram), అమీర్ అలీ ఖాన్ ఎన్నిక కాగా.. వారి నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రాగా వారి స్థానంలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీగా (MLC) ప్రతిపాదించింది. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం (Governor Approval) తెలిపారు. అయితే ఈ విషయం శ్రవణ్, సత్యనారాయణ కోర్టును ఆశ్రయించగా కోదండరాం, అలీఖాన్ నియామకాన్ని రద్దు చేసింది. దీనిపై తాజాగా సీఎం స్పందిస్తూ ప్రొఫెసర్ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తామని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | ఫాంహౌస్‌లో మానవ మృగాలు
హెచ్‌సీయూలో క్రూర మృగాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాలన్నీ ఫాంహౌస్‌లో ఉన్నాయని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయని ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్(Farm House)లలో ఉన్న మావన మృగాలను ముందు బంధించాలన్నారు. తన దగ్గర పంచడానికి డబ్బులు లేవన్నారు. చదువు ఒక్కటే ప్రజలను గుణవంతులను, శ్రీమంతులను చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తామన్నారు.
CM Revanth Reddy | ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా
ఓయూకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజ్(Arts College) ముందు మీటింగ్ పెడతానని చెప్పారు. ఆ రోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్‌లో ఉండడని చెప్పారు. కాగా.. సోమవారం సీఎం పర్యటన సందర్భంగా యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.