ePaper
More
    HomeసినిమాProducer Bunny Vas | అల్లు అర్జున్ సినిమాతో చాలా ఇబ్బంది ప‌డ్డాం.. నిర్మాత బన్నీ...

    Producer Bunny Vas | అల్లు అర్జున్ సినిమాతో చాలా ఇబ్బంది ప‌డ్డాం.. నిర్మాత బన్నీ వాస్ ఆవేదన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Producer Bunny Vas | స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం AA22xA6 (ప్రస్తుత వర్కింగ్ టైటిల్) సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్(Kalanidhi Maran) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఇది పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కేలా ప్రయత్నాలు సాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పరంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌కి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని సమాచారం. ఇక అల్లు అర్జున్(Allu Arjun) ఈ చిత్రంలో నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు . తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారులుగా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. టైమ్ ట్రావెల్, పునర్జన్మ కాన్సెప్ట్‌పై ఈ సినిమా సాగనుందని టాక్.

    Producer Bunny Vas | రోజుకి కోట్లలో బ‌డ్జెట్..

    ఈ సినిమాను గ్లోబల్ మార్కెట్‌లో భారీ స్థాయిలో విడుదల చేయాలన్న దృష్టితో సన్ పిక్చర్స్, హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో డీల్ కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సినిమాకు విస్తృత విడుదల కోసం వార్నర్ బ్రదర్స్(Warner Brothers) భాగస్వామ్యం కీలకమవుతుందని భావిస్తున్నారు. సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకొన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే. మరోవైపు, విలన్‌గా విజయ్ సేతుపతి కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను దాదాపు ₹700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్‌ కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

    అయితే ఇటీవ‌ల షూటింగ్‌కు ముంబైలో బ్రేక్ పడింది. ఇందుకు కారణం టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్ అని చిత్ర నిర్మాత బన్నీ వాస్(Producer Bunny Vas)వెల్లడించారు. క‌న్యా కుమారి సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముంబైలో మా సినిమాకు రోజుకు కోట్ల రూపాయల ఖర్చు వస్తోంది. టాప్ ఫారెన్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ టీమ్స్ అందరూ ముంబైకి వచ్చారు. స్ట్రైక్ కారణంగా ఒక్కరోజు షూటింగ్ ఆగినా మాకు భారీ నష్టం. వారు పని చేసినా, చెయ్యకపోయినా వారి డైలీ రిమ్యునరేషన్ మేము చెల్లించాల్సిందే. మా మూవీ ముంబై జ‌రిగిన‌, అది తెలుగు సినిమా కాబ‌ట్టి ఆపాలి. వీళ్లంద‌రికి అసోసియేష‌న్ ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల‌లో ఇబ్బంది ప‌డ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this