అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | బిచ్కుంద (Bichkunda) మండలం గుండెకల్లూరు (Gundekallur) గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం సందర్శించారు. ఈ మేరకు గ్రామంలో వరద తర్వాత పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ఇటీవల వరదలో చిక్కుకుని బయటపడ్డ గొర్రెల కాపర్లతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.
Ex MLA Hanmanth Shinde | వారం క్రితం వరదలో..
గత వారం రోజుల కిందట కురిసిన వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీర పరీవాహక ప్రాంతాల్లో వరదనీరు వచ్చిచేరింది. అలాగే నల్లవాగు (Nallavaagu) పొంగిపొర్లడంతో మంజీరలోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో మంజీర వరద నీటిలో బిచ్కుంద మండలం గుండెకల్లూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు, 650 గొర్రెలు మంజీరలో చిక్కుకున్నారు.
Ex MLA Hanmanth Shinde | అధికారులు సత్వరమే స్పందించడంతో..
గొర్రెల కాపర్లు చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయితో (Sub collector Kiranmai) సహా అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది వ్యయ ప్రయాసలకోర్చి గొర్రెల కాపర్లను ఒడ్డుకు చేర్చిన విషయం తెలిసిందే. అనంతరం గొర్రెలను సైతం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Ex MLA Hanmanth Shinde | మాకు ఎలాంటి సమాచారం లేదు..
అయితే మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో గొర్రెల కాపర్లు మాట్లాడుతూ.. ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి వరద నీరు ఒకేసారి రావడంతో తాము వరదలో చిక్కుకున్నామని వారు పేర్కొన్నారు. నీటిని ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తాము, గొర్రెలు అక్కడే ఆగాల్సి వచ్చిందని.. అధికారులు చివరకు తమను రక్షించారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ ఛైర్మన్ నాల్చర్ రాజు, బస్వారాజ్ పటేల్, మాజీ సర్పంచ్ సంగీత, సాయి గొండ, సంజు పటేల్, హన్మాండ్లు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.