అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urea Shortage | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరకకపోవడతంతో గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులు(Farmers) వరి సాగు చేస్తారు. ప్రస్తుతం పంటకు యూరియా అవసరం. యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరిగి దిగుబడి మంచిగా వస్తుంది. అయితే రాష్ట్రంలో యూరియా కొరత(Urea Shortage) ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటకు అవసరం అయిన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. అదును దాటిన తర్వాత చల్లినా ప్రయోజనం ఉండదంటున్నారు. ఈ క్రమంలో యూరియా కోసం నిత్యం తిరుగుతున్నారు.
Urea Shortage | ఎక్కడ ఉందంటే అక్కడకు..
రైతులు అన్ని పనులు మానుకొని యూరియా కోసం తిరుగుతున్నారు. ఏ సొసైటీకి యూరియా వచ్చిందని తెలిస్తే అక్కడకు పరుగులు తీస్తున్నారు. అర్ధరాత్రి నుంచి లైన్‌లో ఉంటున్నారు. రైతులు భారీగా వస్తుండటంతో సొసైటీ వారు ఒక్కో రైతులు ఒకటి, రెండు సంచులు మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి సరిపోకపోవడంతో రైతులు నిత్యం ఎరువుల దుకాణాలు, సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు.
Urea Shortage | పలుచోట్ల రాస్తారోకో
యూరియా దొరకకపోవడంతో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. మెదక్ జిల్లా(Medak District) నర్సాపూర్‌లో సోమవారం అన్నదాతలు ధర్నా చేశారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో రాస్తారోకోనిర్వహించారు. మెదక్-సిద్దిపేట రహదారిపై రైతుల బైఠాయించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచే ఆధార్ కార్డులు లైన్‌లో పెట్టి యూరియా కోసం రైతులు నిరీక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక సొసైటీ ఎదుట యూరియా కోసం అర్ధరాత్రి పడిగాపులు కాస్తున్నారు.