ePaper
More
    HomeతెలంగాణHyderabad Marathon | ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ భాగస్వామిగా ఏసిక్స్

    Hyderabad Marathon | ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ భాగస్వామిగా ఏసిక్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Marathon | ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ (Japanese sportswear brand) అయిన ఏసిక్స్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ (హెచ్ఆర్ఎస్)తో కలిసి ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ (NMDC Hyderabad Marathon) నిర్వహించింది. ఆగస్టు 23, 24 తేదీల్లో జరిగిన మారథాన్ నగరంలో అతిపెద్ద పరుగు వేదికగా నిలిచింది. స్పోర్ట్స్ గూడ్స్ భాగస్వామిగా, ఏసిక్స్ కీలకమైన మారథాన్ నగరాల్లో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటుంది. ఆగస్టు 22, 23 తేదీల్లో జరిగిన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని (Hitex Exhibition Centre) స్పోర్ట్ ఎక్స్‌పోలో తమ ప్రత్యేక ఉత్పత్తుల శ్రేణిని ఏసిక్స్ ప్రదర్శించింది.

    Hyderabad Marathon | ఏసిక్స్​ ఉత్పత్తులు

    ఏసిక్స్ అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఐకానిక్ జెల్ -KAYANO 32 ఇందులో అగ్రభాగంలో ఉంది. అత్యాధునిక 4D గైడెన్స్ సిస్టమ్, ప్యూర్ GEL టెక్నాలజీ శక్తితో ఇది ప్రతి మైలుకూ సాటిలేని మద్దతు, కుషనింగ్‌ను అందిస్తుంది. పాదరక్షలకు అనుబంధంగా ఏసిక్స్ అధిక-పనితీరు గల దుస్తులు, ఉపకరణాలు కూడా ప్రదర్శించారు. ఏసిక్స్ ఇండియా, సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ రజత్ ఖురానా మాట్లాడుతూ, భారతదేశ క్రీడా మార్కెట్ (Indian sports market) అపూర్వ వృద్ధిని సాధిస్తోందన్నారు. ఈ పెరుగుదలకు మారథాన్‌లు దాదాపు 24 శాతం దోహదపడుతున్నాయని చెప్పారు.

    Hyderabad Marathon | మైలురాయిగా నిలిచింది

    ఎన్​డీఎంసీ హైదరాబాద్ మారథాన్ 2025తో (NMDC Hyderabad Marathon 2025) భాగస్వామ్యంతో ఈ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిందని రజత్ ఖురానా అన్నారు. తమ బ్రాండ్ ప్రమోషన్​కు ఇంది ఎంతో దోహదపడుతుందన్నారు. ఎన్​ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెత్స మాట్లాడుతూ, మారథాన్ 14వ ఎడిషన్ లో 28 వేల కంటే ఎక్కువ మంది రన్నర్లు పాల్గొన్నారని చెప్పారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మారథానర్ల రాకతో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మారథాన్‌ను మరింత ప్రభావవంతంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.

    Latest articles

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    mid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌...

    More like this