అక్షరటుడే, ఇందూరు: Nizamabad Medical College | నిజామాబాద్ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాహుల్పై ర్యాగింగ్ ఘటన (Raging) ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కళాశాలలో సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ నేతృత్వంలో జీజీహెచ్ (Nizamabad GGH) ఇన్ఛార్జి సూపరింటెండెంట్ రాములు, శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు ఘటనపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థి రాహుల్ తల్లిదండ్రులు సైతం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు.
రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఐదుగురుపై కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ ఘటనను సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సీరియస్గా తీసుకున్నారు.
Nizamabad Medical College | సీపీ సాయి చైతన్య సీరియస్..
ర్యాగింగ్ ఘటనపై పోలీసులు భారత న్యాయ సంహిత (BNS) 292, 115(2), 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ భూకయ్య ఈ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. బాధితుడికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి చేసిన వారిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు.