అక్షరటుడే, వెబ్‌డెస్క్: Atrocity case | వరంగల్ (Warangal) మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) ఇటీవల అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకులపై దాడి చేశారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.
వరంగల్ ఫోర్ట్ రోడ్డులో (Warangal Fort Road) ఓ మహిళ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతోంది. శుక్రవారం రాత్రి ఎస్సై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వచ్చాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ (fast food center) నిర్వహిస్తున్న దళిత మహిళ సండ్ర మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై దాడి చేశాడు. రాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచినందుకు వారిని తిట్టాడు. అంతేగాకుండా మరియమ్మ చెంపపై కొట్టాడు. సీసీ కెమెరాలో (CCTV camera) ఎస్సై దాడి చేసిన దృశ్యం రికార్డు అయింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
Atrocity case | బాధితుల ఫిర్యాదు మేరకు
తమను కులం పేరుతో దూషించి, చేయి చేసుకున్నాడని మరియమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC and ST atrocity Case) నమోదు చేశారు. కాగా ఎస్సై శ్రీకాంత్ కూడా ఫిర్యాదు చేయగా.. మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Atrocity case | నెటిజన్ల ఆగ్రహం
ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) ఫాస్ట్‌పుడ్ సెంటర్ నిర్వాహకులపై దాడి చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచితే మూసి వేయాలని చెప్పాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నారు. ఓ మహిళ అని చూడకుండా ఎస్సై దాడికి పాల్పడటం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.