అక్షరటుడే, వెబ్బెస్క్ : Peddapalli Bypass | నాందేడ్–తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. నిజామాబాద్, బాసర మీదుగా ఈ రైలు వెళ్తుంది. అయితే ఈ ట్రెయిన్ తిరుపతి నుంచి నాందేడ్ వెళ్లే సమయంలో పెద్దపల్లి జంక్షన్(Peddapalli Junction)లో ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది.
పెద్దపల్లి జంక్షన్లో ఇంజిన్ రివర్స్(Engine Reverse) తీసుకువస్తారు. దీనికోసం దాదాపు 45 నిమిషాల సమయం పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పెద్దపల్లి జంక్షన్ ప్లాట్ఫారం –3 మీద ఇంజిన్ మార్చుకోవడం కోసం రైలును నిలిపివేశారు. దీంతో సమయం వృథా అవుతంది. అదే పెద్దపల్లి బైపాస్(Peddapalli Bypass) రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే ఈ బాధలు తప్పనున్నాయి.
Peddapalli Bypass | పనులు పూర్తయినా..
పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్ పూర్తయింది. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు(Goods Trains) ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రయాణికుల రైళ్లను కూడా ఇదే మార్గంలో పంపిస్తే ఇంజిన్ మార్చే సమస్య ఉండదు. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది. అయితే బైపాస్ లైన్లో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ మార్గంలో సాధారణ రైళ్లను అనుమతించనున్నట్లు తెలిసింది.
పెద్దపల్లి బైపాస్ లైన్ ఎంతో కీలకం. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే కాజీపేట–బల్లార్షా మార్గంలో నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి బైపాస్ లైన్ నిర్మించారు. అలాగే కాజీపేట–బల్లార్షా మధ్య మూడో ట్రాక్ నిర్మాణం కూడా చేపట్టారు. త్వరలో అది కూడా అందుబాటులోకి రానుంది. అలాగే నాలుగో లైన్ నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే పెద్దపల్లి రైల్వే బైపాస్ నుంచి నాందేడ్–తిరుపతి రైలును పంపిస్తే ఇంజిన్ మార్పు కోసం ఆగాల్సిన అవసరం ఉండదని, దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.