ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandra Babu | మందు బాబుల‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన చంద్ర‌బాబు..ఇక ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా?

    CM Chandra Babu | మందు బాబుల‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన చంద్ర‌బాబు..ఇక ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి తాత్కాలికంగా బ్రేక్ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra Babu) స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ(Excise Department) కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన తీసుకురాగా, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం దీనిని తిరస్కరించారు. కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లు ఇప్పటికే ఉన్న బ్రాండ్లకు దగ్గరగా ఉన్న పేర్లతో రావడం పట్ల ప్రభుత్వానికి ప‌లు అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లు(Similar Sounding Brands) ఉపయోగించి భారీ అవకతవకలు జరిగిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.సిట్ నివేదిక ప్రకారం,

    CM Chandra Babu | నో చెప్పిన చంద్ర‌బాబు…

    గత ప్రభుత్వ హయాంలో ఓ కంపెనీ విస్కీని సరఫరా చేస్తూ..ఒక్కో కేసుకి ప్రభుత్వం రూ.696 చెల్లించేది.. అయితే అదే కంపెనీ, అదే నాణ్యతతో మరో విస్కీపేరుతో(Whiskey Brand) కొత్త బ్రాండ్‌ను తీసుకు రాగా, దీని ధరను రూ.1,759గా నిర్ణయించేవాళ్లు. దీని వల్ల ప్రభుత్వానికి ఒక్కో కేసుపై రూ.1,063 నష్టం వాటిల్లడంతో పాటు.. ఈ డబ్బు కమీషన్ల రూపంలోకి మళ్లిందని సిట్ తెలియ‌జేసింది.ఈ క్రమంలో అలాంటి బ్రాండ్లకే మళ్ళీ అనుమతిస్తే, అదే తప్పు రిపీట్ చేసినట్టు అవుతుందని అంటున్నారు. కొత్త బ్రాండ్లు(New Brands) వస్తే, ప్రజాధనం మళ్లీ దుర్వినియోగమవుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల ధరల(Brands Prices)పై సవరణను కేబినెట్ ముందుకు తీసుకువచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికే 40 బ్రాండ్ల ధరలు తగ్గాయి. అయితే మరింత తగ్గితే పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి ఢోకా వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల సవరణపై తుదితీర్మానం త్వరలో వెలువడనుంది. మొత్తంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్ల  ఆమోదాన్ని నిలిపివేసింది. భవిష్యత్తులో మద్యం పాలసీలో మరిన్ని మార్పులు వస్తాయా అన్నది వేచి చూడాలి.

    Latest articles

    Shabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేదు..

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పదేళ్ల పాటు అధికారం సాగించిన బీఆర్ఎస్ పాలనలో (BRS) దోపిడీ తప్ప...

    Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన...

    Eagle Team | హైదరాబాద్​లో రేవ్​పార్టీ భగ్నం.. నిందితుల్లో డిప్యూటీ తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్​ (Hyderabad)లో డ్రగ్స్​ కల్చర్​ రోజురోజుకు పెరిగిపోతుంది. రేవ్​పార్టీలు, బర్త్​...

    Union Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి శివరాజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Union Minister Shivraj | ఎవరి ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదని, ఇది నయా భారత్ అని...

    More like this