అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : ఫెడ్ చైర్మన్(Fec chiarman) జెరోమ్ పావెల్ జాక్సన్‌హోల్ ప్రసంగం తర్వాత యూఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తుతున్నాయి. దీంతో గత ట్రేడింగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wall street)లో ఐదు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ ర్యాలీ తీశాయి. యూరోప్ మార్కెట్లు సైతం పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉంది.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
నాస్‌డాక్(Nasdaq) 1.88 శాతం, ఎస్‌అండ్‌పీ 1.52 శాతం లాభపడ్డాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.07 శాతం నష్టంతో సాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
సీఏసీ 0.39 శాతం, డీఏఎక్స్(DAX) 0.29 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.13 శాతం లాభాలతో ముగిశాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం ఎక్కువగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.13 శాతం, హాంగ్‌సెంగ్(Hang Seng) 1.97 శాతం, షాంఘై 1.18 శాతం, కోస్పీ 0.94 శాతం, నిక్కీ 0.65 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.07 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.29 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐలు మూడోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,622 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐ(DII)లు 32 ట్రేడిరగ్ సెషన్‌ల తర్వాత తొలిసారి నెట్ సెల్లర్లుగా మారారు. నికరంగా రూ. 329 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.09 నుంచి 0.73 కు తగ్గింది. విక్స్(VIX) 3.12 శాతం పెరిగి 11.73 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.20 శాతం పెరిగి 67.86 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలహీనపడి 87.52 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.27 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.91 వద్ద కొనసాగుతున్నాయి.
జాక్సన్ హోల్ సింపోజియంలో ప్రసంగించిన ఫెడ్ చైర్మన్ పొవెల్.. రాబోయే నెలల్లో విధాన పరమైన సర్దుబాట్లు ఉండొచ్చన్న సూచన ఇచ్చారు.
దీంతో వచ్చేనెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో వాల్‌స్ట్రీట్‌తోపాటు ఆసియా మార్కెట్లూ పరుగులు తీస్తున్నాయి.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తన పశ్చిమ కుర్క్స్ ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ప్రారంభించిందన్న రష్యా ప్రకటన నేపథ్యంలో జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగే అవకాశాలున్నాయి. రష్యా(Russia) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది.