అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Makloor Murder case | నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ Nizamabad నగరానికి చెందిన జీలకర ప్రసాద్, అతడి స్నేహితుడు ఇద్దరు కలిసి ఆదివారం (ఆగస్టు 24) రాత్రి మాక్లూర్ (Makloor) మండలంలోని ధర్మోరా గ్రామానికి వెళ్లారు. అక్కడే ఇద్దరు హత్యకు గురయ్యారు.
Makloor Murder case : వివాహేతర సంబంధమే కారణమా..?
నగరంలోని గౌతమ్ నగరానికి చెందిన ప్రసాద్ గతంలో ఓ పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఇతడికి ధర్మోరా గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రసాద్ గ్రామానికి రాగా.. అతడితోపాటు ఆయన స్నేహితుడిని స్థానికులు దొరకబట్టుకుని చితకబాదినట్లు తెలుస్తోంది. తాళ్లతో బంధించి, తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది.
Makloor Murder case : మహిళ బంధువులే..
ప్రసాద్‌తో వివాహేతర సంబంధం కలిగిన మహిళ బంధుమిత్రులు కలిసి యువకులను హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రసాద్, అతడి మిత్రుడు గ్రామంలోకి రాగానే పక్కా ప్లాన్ ప్రకారం.. ఇరువురిపై దాడికి పాల్పడ్డారు.
యువకుల కంట్లో కారం చల్లి, ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే మరణించగా.. అతడి స్నేహితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.