అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్ మెడికల్ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్ ఘటనపై ఎట్టకేలకు కేసు నమోదైంది. ర్యాగింగ్ విషయం బయటకు పొక్కకుండా కాలేజీ అధికారులు చేసిన విశ్వ ప్రయత్నాలు మీడియా రాకతో విఫలం అయ్యాయి.
మెడికో లీగల్ కేసు ఇష్యూ medico legal case (MLC) చేయడంతో ఎట్టకేలకు ఆదివారం (ఆగస్టు 24) నిజామాబాద్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది.
Medical College Raging case : ఎఫ్ఐఆర్ ప్రకారం..
బాధిత విద్యార్థి గౌరవరం రాహుల్ రెడ్డిపై (22) సీనియర్లు సాయి రామ్ పవన్, శ్రవణ్, సాత్విక్ హృదయపాల్, అభినవ్ తదితరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ మేరకు బాధిత విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Medical College Raging case : అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా.. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు (హౌస్ సర్జన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు.
బాధిత విద్యార్థి ఈ విషయమై శనివారం (ఆగస్టు 23) సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ప్రశ్నలతో విసిగించారు. Raging ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు.. జాండిస్ అయ్యాయి.. తనను వదిలేయమని ప్రాధేయపడినా.. వదిలిపెట్టలేదు. రకరకాలుగా అతడిని వేధించారు. విచారణ పేరుతో పిలిపించి ఇబ్బందులకు గురిచేశారు.
నోరు మూయించే ప్రయత్నం చేసిన సూపరింటెండెంట్..
బాధిత విద్యార్థి రాహుల్ ర్యాగింగ్ విషయాన్ని తొలుత అసిస్టెంట్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. కానీ, సదరు అధికారి ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. బాధిత విద్యార్థినే బెదిరించాడు. ర్యాగింగ్ విషయం బయటకు చెప్పొద్దని, నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించాడని రాహుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ర్యాగింగ్ ఘటనపై పోలీసులు భారత న్యాయ సంహిత (BNS) 292, 115(2), 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ భూకయ్య ఈ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. బాధితుడికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.