ePaper
More
    HomeతెలంగాణTeacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

    నందిపేట్ (nandipet) ఎంఈవో విచారణ చేపట్టిన అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (Deo Ashok) సమర్పించారు. రెండో తరగతి విద్యార్థులను చితకబాది.. వారి కళ్లల్లో కారం చల్లినట్లు తేలడంతో ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శంకర్ (Teacher Shankar) నందిపేట్ మండలంలోని మాయాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్, కానీ కుద్వాన్​పూర్​లో డిప్యూటేషన్​పై విధులు నిర్వహిస్తున్నారు.

    Teacher suspension | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్​ సైకోలా మారి..

    నందిపేట (Nandipet) మండలం కుద్వాన్​పూర్​ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు (Govt Teacher) విచక్షణరహితంగా వ్యవహరించారు. చిన్నారులని కూడా చూడకుండా కంట్లో కారం కొట్టి చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలోని రెండు, మూడో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను సదరు ఉపాధ్యాయుడు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అల్లరి చేస్తున్నారనే కారణంతో వారిని కొట్టడంతో పాటు కంట్లో కారం పోశాడు. ఇటీవల ఈ ఘటన జరగ్గా మరుసటి రోజు నుంచి ఆయన బడికి రావడం మానేశాడు.

    Teacher suspension | తల్లిదండ్రులు రావడంతో..

    పిల్లలను కొట్టిన తర్వాత బడికి రావడం మానేసిన ఉపాధ్యాయులు శనివారం తిరిగి హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని అతడిపై దాడికి యత్నించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎంఈవో పాఠశాలకు చేరుకొని వివరాలు సేకరించారు.

    Nandipet | ఎంఈవో విచారణ

    ఘటనపై నందిపేట ఎంఈవో గంగాధర్ (MEO Gangadhar) విచారణ చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆయమ్మ నుంచి వివరాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు డీఈవోకు అందజేశారు. దీంతో డీఈవో చివరకు ఉపాధ్యాయుడు శంకర్​ను సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this