అక్షరటుడే, భీమ్గల్: TNGo’s Nizamabad | ఉద్యోగుల హక్కుల సాధనకు జంగ్ సైరన్(Jung Siren) మోగించాల్సిన సమయం వచ్చిందని ఎంప్లాయీస్ జేఏసీ (Employees JAC) జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ (TNGOs Nizamabad) జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు.
ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో ఎస్ఆర్ఎస్పీ(SRSP), భీమ్గల్ (Bheemgal) యూనిట్ల అధ్యక్షులు సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి యూనిట్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా పలు ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా భావించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలపాలని స్పష్టం చేశారు.
అలాగే సీపీఎస్ అంతం కోసం ఏర్పాటుచేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీన జిల్లాకేంద్రానికి విచ్చేస్తున్న జేఏసీ రాష్ట్ర నాయకులను ఆహ్వానించాలని, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం బహిరంగ సభకు పెద్దఎత్తున ఉద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ఆర్మూర్ యూనియన్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, ఎస్సారెస్పీ యూనిట్ కార్యదర్శి సాయికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఇరు యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.