ePaper
More
    Homeక్రీడలుAsia Cup | ఆసియా కప్‌ 2025కి అఫ్గానిస్తాన్‌ సన్నద్ధం.. రషీద్ ఖాన్‌ సారథ్యంలో బ‌ల‌మైన...

    Asia Cup | ఆసియా కప్‌ 2025కి అఫ్గానిస్తాన్‌ సన్నద్ధం.. రషీద్ ఖాన్‌ సారథ్యంలో బ‌ల‌మైన టీం ప్రకటించిన ఆఫ్ఘ‌న్ క్రికెట్ బోర్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Asia Cup | గత టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్‌ జట్టు (Afghanistan team), ఇప్పుడు అదే ఉత్సాహంతో ఆసియా కప్ కోసం సిద్ధమవుతోంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వంలో 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును అఫ్గాన్ క్రికెట్ బోర్డు (Afghan Cricket Board) తాజాగా ప్రకటించింది. 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టోర్నీ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్ దాకా చేరి కొత్త చరిత్ర లిఖించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే జోరుతో ఆసియా కప్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతోంది.

    Asia Cup | బ‌ల‌మైన టీం..

    అబుదాబి వేదికగా ఆసియా కప్ (Asia Cup) సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. మొద‌టి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్​, హాంగ్‌కాంగ్‌తో తలపడనుంది. అఫ్గాన్ జట్టు గ్రూప్-ఏలో ఉన్న నేప‌థ్యంలో ఆ జ‌ట్టు.. బంగ్లాదేశ్, శ్రీలంక (Srilanka), హాంగ్‌కాంగ్ జట్లతో త‌ల‌ప‌డ‌నుంది. సెప్టెంబర్ 16న బంగ్లాదేశ్‌తో, 18న శ్రీలంకతో తన గ్రూప్ మ్యాచ్‌లను అబుదాబిలోనే ఆడనుంది. ఈ సారి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని అఫ్గానిస్తాన్ భావిస్తుంది. ర‌షీద్ ఖాన్ నేతృత్వంలో జ‌ట్టు అద్భుతాలు చేస్తుంద‌ని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు.

    Asia Cup | జట్టు సభ్యులు

    రషీద్ ఖాన్ (Rashid Khan)(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అల్లా ఘజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌హక్ ఫరూఖీ.

    అద్భుతంగా ఆడే యువతతో కూడిన ఈ జట్టు, ఇప్పుడు ఆసియా కప్ టైటిల్‌పై కన్నేసింది. బౌలింగ్‌లో రాణించే స్పిన్నర్లు (Spinners), ఆల్‌రౌండర్ల సమతుల్యత, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌తో అఫ్గాన్ జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే సెమీ ఫైనల్ అనుభవాన్ని అందిపుచ్చుకున్న అఫ్గానిస్తాన్, ఇప్పుడు టైటిల్‌ గెలుచుకునే లక్ష్యంతో రంగంలోకి దిగబోతోంది. అభిమానులు ఆశిస్తున్న విజయయాత్ర కొనసాగుతుందేమో చూడాలి!

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this