అక్షరటుడే, ఇందూరు: Yoga Association | జిల్లా యోగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నగరంలోని యోగా అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) నుంచి బొబ్బిలి నర్సయ్య, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (District Sports Authority) నుంచి ప్రశాంత్, రాష్ట్ర యోగా అసోసియేషన్ నుంచి ఉప్పు రవీందర్ పరిశీలకులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షురాలిగా ఐశ్వర్య, సహ కారదర్శలుగా ప్రవీణ్ నాయుడు, రజిత, ఆనంద్ కార్యదర్శిగా సీహెచ్ గంగాధర్, కోశాధికారిగా కమలా వాణి, సభ్యులుగా అశోక్, ప్రవీణ్ కుమార్, గాయత్రి, లోహిదాస్, మాధురి, సుధా, విజయభాస్కర్ ఎన్నికయ్యారు.