ePaper
More
    HomeతెలంగాణBJP Nizamabad | రేపు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాక

    BJP Nizamabad | రేపు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాక

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) సోమవారం ఇందూరు పర్యటనకు రానున్నారని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachary) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని శ్రీరామ గార్డెన్​లో బూత్ స్థాయి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Arvind) హాజరవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇందల్వాయి (Indalwai) టోల్​గేట్​ వద్ద స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా శ్రీరామ గార్డెన్​కు చేరుకుంటారని తెలిపారు.

    కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

    తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దినేష్​ కులాచారి అన్నారు. ఓటు చోరీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్​కు లేదని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul gandhi) అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు (National Yellow Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగోల లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మా రెడ్డి, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...