ePaper
More
    HomeతెలంగాణKTR | ద‌మ్ముంటే రాజీనామా చేసి గెలవండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేటీఆర్ స‌వాల్‌

    KTR | ద‌మ్ముంటే రాజీనామా చేసి గెలవండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేటీఆర్ స‌వాల్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వి పోతుంద‌న్న భ‌యం ప‌ట్టుకుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఆయా ఎమ్మెల్యేలు ద‌మ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ గుర్తుపై ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని స‌వాల్ చేశారు.

    సుప్రీంకోర్టు (Suprem Court) ఆదేశాల‌తో ప‌ద‌వి పోతుంద‌ని, మ‌ళ్లీ పోటీ చేస్తే ఓట‌మి త‌ప్ప‌ద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మంచి పనులు చేస్తే.. ఉప ఎన్నికలు అంటే భయం ఎందుకని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయాలని.. ఎవరు గెలుస్తారో చూసుకుందామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డినా?.. కేసీఆరా? అనేది ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు.

    KTR | కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు..

    దాదాపు రెండేళ్ల పాల‌న‌లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. అధికారంలోకి 20 నెల‌లు దాటుతున్నా ప్ర‌జ‌లకు చేసిందేమీ లేద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 20 నెలల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్‌లపై (KCR And KTR) కేసులు నమోదు చేయడం తప్పా అంతకు మించి చేసిందేమి లేదన్నారు. ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే (Sherilingampalli MLA) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని విమ‌ర్శించారు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీని వీడినా.. శేరిలింగంపల్లిలోని కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

    KTR | హైడ్రా పేరుతో అరాచ‌కం..

    హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో (Hyderabad) అరాచకం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి (CM Revanth Reddy Brother) ఇల్లు కూల్చే దమ్ము ఉందా? అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్‌మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ (Hyderabad Realestate) పూర్తిగా కుప్పకూలిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా? అని కేటీఆర్ నిలదీశారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒక రోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.

    KTR | బీఆర్ఎస్ అడ్డా హైద‌రాబాద్

    గ్రేటర్ హైదరాబాద్ నగరం (Greater Hyderabad City) బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ (KCR)  ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారన్నారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లు వేశారని అన్నారు.

    More like this

    September 6 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 6 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 6,​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...