అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahavatar Varsimha | హిందూ పురాణాల ఆధారంగా రూపొందిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ (mahavathar narasimha) భారత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి యానిమేటెడ్ సినిమాల చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, జూలై 25న దేశవ్యాప్తంగా విడుదలై అనూహ్యమైన స్పందనను పొందింది. తాజా వసూళ్ల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 278 కోట్లు వసూలు చేసి, భారతీయ యానిమేటెడ్ చిత్రాలలో ప్రభంజనం సృష్టించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అద్భుత స్పందనను నమోదు చేసుకుంది.
Mahavatar Varsimha | భారీ ఆదరణ..
కుటుంబ ప్రేక్షకులు నచ్చడంతో చిన్నారుల నుంచీ వృద్ధుల వరకూ ప్రతి వయసు ప్రేక్షకుడు థియేటర్స్‌కి క్యూ కట్టారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రం (mahavathar narasimha Movie) హిందూ పురాణాల్లోని శ్రీమహావిష్ణువు దశావతారాల పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఈ చిత్రం ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ అనే 7 భాగాల సిరీస్‌లో మొదటి భాగం కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అశ్విన్ కుమార్ (Ashwin Kumar) దర్శకత్వం వహించగా, అధునాతన యానిమేషన్ టెక్నాలజీతో తయారు చేసిన విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ భారీ విజయం భారతీయ యానిమేటెడ్ చిత్రాలకు నూతన దిశగా మార్గం చూపించిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటివరకు భారతీయ యానిమేటెడ్ చిత్రాలు చిన్న పిల్లలకే పరిమితమయ్యేలా ఉండగా, ‘మహావతార్ నరసింహ’ సినిమాతో యానిమేషన్ చిత్రాలకు విస్తృత ప్రేక్షకాభిమానాన్ని తీసుకురావచ్చని నిరూపితమైంది. ‘మహావతార్ నరసింహ’ విజయం భారతీయ సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం మాత్రమే కాదు, యానిమేషన్‌కు (Animation Movies) మరింత ప్రాముఖ్యత కలిగేలా చేసింది.ఇందులో రాబోయే భాగాలకు మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎటువంటి ప్రమోషన్ లేకుండా మహావతార్ నరసింహ ఇంత పెద్ద విజయం సాధించడం నిజంగా గొప్ప విషయం.