అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vinayaka Navratri | హిందూ క్యాలెండర్‌లో భాద్రపద(Bhadrapadam) మాసం ఆరో నెల. చాతుర్మాస్యంలో రెండో మాసమైన ఈనెల భగవంతుడి ఆరాధన, ఆత్మశోధన, పితృ ఆరాధనకు అనువైనదిగా భావిస్తారు.
Vinayaka Navratri | నేటి నుంచి భాద్రపద మాసం..
ఈ నెలలోనే వినాయక(Vinayaka) నవరాత్రులు వస్తాయి. వాడవాడలా గణేశ్ మండపాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో అంతటా సందడి నెలకొననుంది.
వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి (Rushi panchami) అని పిలుస్తారు. ఆ రోజున స్త్రీలు సప్తర్షులను పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే రుషుల అనుగ్రహంతో దోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం వరుసగా సూర్య షష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు.
తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, భాద్రపద ఏకాదశి రోజున మరోపక్కకు మారుతాడు. అందుకే ఈ రోజుకు ‘పరివర్తన ఏకాదశి’ (Parivartana Ekadashi) అన్న పేరు వచ్చింది. ఇది రుతువులలో వచ్చే మార్పును, మనుషులలో రావాల్సిన పరివర్తనను సూచిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలు నశిస్తాయన్నది భక్తుల విశ్వాసం.
పరివర్తన ఏకాదశి మరునాడు వామన జయంతి(Vamana jayanti) వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే. భాద్రపద మాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. ఈ పక్షం రోజుల్లో పితృ దేవతలను ఆరాధిస్తారు. భాద్రపద మాసం చివరి రోజు పితృ అమావాస్యగా పెత్రమాసగా జరుపుకుంటారు. ఆ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు.
Vinayaka Navratri | ఈ మాసంలో వచ్చే పర్వదినాలు..
- ఆగస్టు 25 : వరాహ జయంతి.
- ఆగస్టు 27 : గణేశ్ చతుర్థి.
- ఆగస్టు 28 : రుషి పంచమి.
- ఆగస్టు 29 : సూర్య షష్ఠి.
- ఆగస్టు 30 : లలితా సప్తమి.
- ఆగస్టు 31 : రాధాష్టమి, మహాలక్ష్మి వ్రతం.
- సెప్టెంబర్ 3 : పరివర్తన ఏకాదశి
- సెప్టెంబర్ 4 : వామన జయంతి
- సెప్టెంబర్ 5 : ఓనం, ప్రదోష వ్రతం.
- సెప్టెంబర్ 6 : అనంత చతుర్దశి, గణేశ్ విగ్రహాల నిమజ్జనం.
- సెప్టెంబర్ 7: భాద్రపద పూర్ణిమ, చంద్రగ్రహణం
- సెప్టెంబర్ 8 : నుంచి మహాలయ పక్షం.
- సెప్టెంబర్ 21: బతుకమ్మ సంబురాలు ప్రారంభం.