ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​NTR Fans | అనంతపురంలో హైటెన్షన్‌.. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడికి ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ యత్నం

    NTR Fans | అనంతపురంలో హైటెన్షన్‌.. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడికి ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ యత్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NTR Fans | ఆంధ్రప్రదేశ్​లోని అనంతరపురం (Anantarapuram)లో ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (MLA Daggupati Venkateswara Prasad) క్యాంప్​ ఆఫీస్​ను ముట్టడించడానికి జూనియర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

    ఎమ్మెల్యే దగ్గుబాటి ఇటీవల జూనియర్​ ఎన్టీఆర్​ (NTR)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆడియో వైరల్​ అయిన విషయం తెలిసిందే. ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానుల సమాఖ్య నేత ధనుంజయ నాయుడుతో ఎన్టీఆర్​ను దూషిస్తూ మాట్లాడారు. అసభ్య పదజాలం ప్రయోగించారు. ఎన్టీఆర్​ సినిమాలను అనంతపురంలో ఆడనివ్వమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై జూనియర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను అలా మాట్లాడలేదని ఇప్పటికే ఎమ్మెల్యే తెలిపారు. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న ఫ్యాన్స్​ ఆదివారం ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

    NTR Fans | భారీగా పోలీసుల మోహరింపు

    యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ అనంతరపురం వస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనంతపురం నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) దగ్గుబాటి ప్రసాద్ నివాసం, క్యాంప్​ ఆఫీస్​ దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు.

    NTR Fans | క్యాంప్​ ఆఫీస్​ దగ్గర బైఠాయింపు

    పోలీసులు భారీగా మోహరించిన ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ భారీ సంఖ్యలో అనంతరపురం తరలివచ్చారు. MLA దగ్గుపాటి క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి వారు యత్నించారు. అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం దగ్గర ఫ్యాన్స్‌ బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అభిమానులను అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్యాన్స్​ను మధ్యలోనే అరెస్ట్​ చేస్తున్నారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this