అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి తన సింప్లిసిటీతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
విలాసవంతమైన లంబోర్ఘినిలో ప్రయాణిస్తున్నప్పటికీ, రోడ్డుపై ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్న సమయంలో ఒక అభిమానిని చూసి స్పందించిన తీరు సోషల్ మీడియాలో (social media) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల రోహిత్ శర్మ ముంబైలో తన ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా, ట్రాఫిక్ జామ్‌లో (traffic jam) ఆయన కారు నిలిచిపోయింది. అదే సమయంలో పక్కగా వెళ్తున్న ఓ అభిమాని రోహిత్‌ను గమనించి, తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు.
Rohit Sharma | సింప్లిసిటీ..
తనను ఎవరో గుర్తించారని గ్రహించిన రోహిత్ అసహనం వ్యక్తం చేయకుండా, చిరునవ్వుతో అభిమానిని చూసి ‘థమ్సప్’ సింబల్ చూపించాడు. ఇది చూసిన అభిమాని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రోహిత్ వినయంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవలే రోహిత్ శర్మ టెస్టు మరియు టీ20 ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ అయ్యాడు. వన్డే క్రికెట్‌కి సంబంధించిన తదుపరి సిరీస్ ప్రారంభం కావటానికి సమయం ఉండటంతో, ప్రస్తుతం కుటుంబంతో పాటు ముంబైలో (Mumbai) విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంలో వ్యక్తిగత పనులకూ కాస్త సమయం కేటాయిస్తున్నాడు.
స్టార్ క్రికెటర్లను చూసే అవకాశం వచ్చినప్పుడు వారిలో ఎంతోమంది అభిమానుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, రోహిత్ శర్మ మాత్రం తన అభిమానుల పట్ల చూపిన వినయంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ‘లంబోర్ఘినిలో (Lamborghini Car) ప్రయాణించినా.. మనసు మాత్రం సాధారణ వ్యక్తిలాగే ఉంది’’ అంటూ నెటిజన్లు ప్రశంసలతో సోషల్ మీడియాని (Social media) నింపేస్తున్నారు. ఇక రోహిత్ శర్మ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కోసం మైదానంలో దిగనున్నాడు. 2027 వరల్డ్ కప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.
Rohit Sharma got stuck in Mumbai traffic in his new Lamborghini, but he still didn’t forget to wave to his fans while heading home after finishing training.❤️
The man with golden heart @ImRo45 🐐 pic.twitter.com/ioJvh93h7b
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 22, 2025