అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajnath Singh | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఐఏడీడబ్ల్యూఎస్ అనేది అన్ని స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణులు, హై-పవర్ లేజర్-ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్ (DEW) కలిగిన బహుళ-పొరల వాయు రక్షణ వ్యవస్థ ఉంది.
IADWS test | అభినందించిన రాజ్‌నాథ్
ఐఏడీడబ్ల్యూఎస్ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) డీఆర్‌డీవో, భారత సాయుధ దళాలను అభినందించారు. ఈ మేరకు డీఆర్‌డీవో సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ ప్రత్యేకమైన విమాన పరీక్ష మన దేశం బహుళ వాయు-రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచింది. శత్రు వైమానిక ముప్పు నుంచి తీర ప్రాంత రక్షణను బలోపేతం చేయబోతోంది” అని ఆయన పేర్కొన్నారు.