ePaper
More
    Homeక్రీడలుRinku Singh | ఒక్క లైకుతో ముగ్గులోకి దించాడు.. రింకూ సింగ్ మాములోడు కాదు భ‌య్యా..!

    Rinku Singh | ఒక్క లైకుతో ముగ్గులోకి దించాడు.. రింకూ సింగ్ మాములోడు కాదు భ‌య్యా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rinku Singh | టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Cricketer Rinku Singh) తాజాగా తన ప్రేమకథను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్(Samajwadi Party MP Priya Saroj)తో రింకూకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట‌ను చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక‌రేమో క్రికెట్‌లో ఉప్పెనలా ఎదుగుతున్న స్టార్ అయితే, మరొకరు ఎంపీగా ప్రజాసేవలోకి అడుగుపెట్టిన యువనాయకి. వీరిద్దరికి జోడీ ఎలా కుదిరింది అని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ కాదని, చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నామ‌ని రింకూ తాజాగా వెల్లడించాడు.

    Rinku Singh | ల‌వ్ సీక్రెట్..

    “మూడేళ్ల క్రితం (2022), కరోనా కాలంలో ఓ ఫ్యాన్ పేజీలో ప్రియా (Priya Saroj) ఫొటోను చూసాను. ఆ ఫొటోనే ప్రేమకు బీజం వేసింది అని రింకూ చెప్పాడు. ఆమె గురించి ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించిన రింకూ, ఆమె రాజకీయ కుటుంబానికి చెందినవారన్న విషయం తెలుసుకున్నాక ముందు భయపడ్డాడట. కొద్ది రోజులకు ప్రియా రింకూ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలకి (Instagram photos) లైక్ చేయ‌డంతో ధైర్యం వచ్చి మెసేజ్ చేశాడు. ఇన్‌స్టాలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. ప్రతిరోజూ మాట్లాడుకుంటూ, నెమ్మదిగా బంధం బలపడింది. అయితే ప్రియ ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయ జీవితం బిజీగా మారింది. రింకూ క్రికెట్ మ్యాచ్‌లతో తీరిక లేకుండా ఉన్నాడు. అయినా మా ప్రేమ‌లో ఎలాంటి మార్పు రాలేద‌ని అన్నాడు.

    రోజంతా ఇద్దరం బిజీగా ఉంటాం. అందుకే ఎక్కువగా రాత్రి సమయంలో మాట్లాడుకునే వాళ్లం అని తెలిపారు. వ్యక్తిగత విషయాలు, వృత్తి సంబంధిత అంశాలు చర్చించుకుంటూ… అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకునేలా బంధం కొనసాగింది. తర్వాత కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పి, వారి అంగీకారంతో నిశ్చితార్థం (Engagement) జరిగింది. ఈ వేడుకకు కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)ను ఆహ్వానించగా, షెడ్యూల్ బిజీగా ఉండటంతో హాజరుకాలేకపోయాడట. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మచిలీషహర్ నుంచి ప్రియ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించింది. ఆమె బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్ ను 35,000 ఓట్ల తేడాతో ఓడించింది. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియ యువతలో మంచి ఆదరణ పొందుతోంది. ఇక గతేడాది కొన్ని మ్యాచ్‌ల్లో అంతగా మెరగలేకపోయిన రింకూ, ప్రస్తుతం యూపీ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో సెంచరీ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 కోసం సిద్ధమవుతున్నాడు.

    Latest articles

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    More like this