ePaper
More
    HomeతెలంగాణSR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది.

    చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఉన్న ఎస్ఆర్ ఫార్మా కంపెనీ(SR Pharma Company)లో ఈ ఘటన చోటుచేసుకుంది.

    శనివారం (ఆగస్టు 23) రాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ మంటల కారణంగా కంపెనీలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

    SR Pharma Company : కార్మికుల ఆగం..

    మంటలు భారీగా ఎగిసిపడటంతో కార్మికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నారు.

    భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది (Firefighters) శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

    మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కార్మికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

    అగ్ని ప్రమాద సమయంలో ఫార్మా కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే దానిపై కంపెనీ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

    అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (short circuit) వల్లనే మంటలు వ్యాప్తి చెందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

    అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    More like this