అక్షరటుడే, కామారెడ్డి : Police raids : కామారెడ్డి పట్టణంలోని పలు పాన్ షాపుల(pan shops)లో మైనర్ పిల్లలకు నిషేధిత గుట్కా, హుక్కా(Hookah) పదార్థాలు విక్రయిస్తున్నారు. పాన్ షాప్ వ్యాపారులు వారి స్వలాభం కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు.
ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు పలు పాన్ షాపులపై శనివారం (ఆగస్టు 23) రాత్రి దాడులు (Police raids) చేపట్టారు. పలు షాపుల్లో పెద్ద మొత్తంలో నిషేధిక గుట్కా, హుక్కా మిషన్లు, హుక్కా ఫ్లేవర్ బాక్సులు లభించడంతో పోలీసులే షాక్ అయ్యారు.
రూ.1.04 లక్షల విలువ చేసే హుక్కా, గుట్కా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల రోడ్డులో ఉన్న ఎం.ఎం పాన్ షాపులో నిషేధిత ఈ సిగరెట్స్, హుక్కాకు సంబందించిన పలు పదార్థాలు, గుట్కా నిల్వలను పోలీసులు గుర్తించారు.
ఈమేరకు షాపు యజమాని మహమ్మద్ సల్మాన్ ఖాన్, అతని సోదరుడు ఇబ్రహీం ఖాన్, ఇంటి యజమాని జాకీర్ హుసేన్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Police raids : స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాల వివరాలు
- అఫ్జల్ కంపెనీ హుక్కా ఫ్లేవర్ బాక్సులు-55
- హుక్కా స్మోకింగ్ మిషన్స్-11
- హుక్కా పైప్స్-12
- స్మాల్ హుక్కా పేపర్ రోల్స్-8
- ZL-O జాఫ్రాన్ జర్దా ప్యాకేట్స్-8,
- నంబర్ 1 టొబాకో ప్యాకేట్స్-18
- ఆర్ ఆర్ టొబాకో ప్యాకెట్స్-10
- M సెంటన్స్డ్ టొబాకో పౌచెస్-60
- మాక్సిమాస్ లగ్జరీ చూవింగ్ టొబాకో పౌచ్-60
- కే.ఎఫ్ టొబాకో పాకెట్-1
- షీసా N ఫ్లేవర్ డబ్బాలు-3
- బాబా టొబాకో-120 పౌచెస్
- ఆల్ అక్బర్ బ్రిక్ కోల్ బాక్సులు-8
- ఆల్ అక్బర్ ఫాయిల్ బాక్సులు-60
- రష్ బ్రాండ్ జాఫ్రాని పట్టి-7
- స్వాగత్ టొబాకో పౌచెస్-2
- చైనీ టొబాకో ప్యాకెట్స్-2
- ఎస్ఆర్-1 టొబాకో పౌచెస్-52
- అంబర్ టొబాకో ప్యాకెట్-1
- RN-01 జాఫ్రాని జర్దా ప్యాకెట్స్-40
- షాట్ లగ్జరీ టొబాకో ప్యాకెట్స్-02
- అనార్ టొబాకో ప్యాకెట్స్-17
- డోస్ టొబాకో ప్యాకెట్స్ 19
- బాబా 120 టొబాకో డబ్బా-01
- VI టొబాకో పౌచెస్-25
- డబుల్ బ్లాక్ రాయల్ టచ్ టొబాకో పౌచెస్-21
- M-గోల్డ్ టొబాకో పౌచెస్-12
- షాట్ 777 టొబాకో పౌచెస్-7
- DB రాయల్ టొబాకో పౌచెస్-8
- ఈ సిగరెట్స్-8(ELFBAR Raya D2, 2-ELFABAR ice king, 4-FUNKEY LANDS ci 5000)