అక్షరటుడే, వెబ్‌డెస్క్: Southern Railway : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (South Central Railway General Manager Sanjay Kumar Srivastava) శనివారం (ఆగస్టు 23) ముద్ఖేడ్ – సికింద్రాబాద్ సెక్షన్‌లో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. జీఎంతో పాటు తనిఖీల్లో హైదరాబాద్ డివిజన్ (Hyderabad Division) డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ (Divisional Railway Manager Santosh Kumar Verma), ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
ముద్ఖేడ్ (Mudkhed) – సికింద్రాబాద్ (Secunderabad) సెక్షన్‌లో జీఎం రియర్ విండో ఇన్స్పెక్షన్ చేశారు. రైలు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలు, కీలక రైల్వే స్టేషన్ల భద్రతా అంశాలను సమీక్షించారు.
బాసర రైల్వే స్టేషన్(Basara railway station)లో సౌకర్యాలను జీఎం పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని జీఎం సమీక్షించారు.
Southern Railway : నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిశీలన..
నిజామాబాద్ రైల్వే స్టేషన్(Nizamabad Railway Station)ను పరిశీలించిన జీఎం.. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్ వెలుపల సర్క్యులేటింగ్ ఏరియాను పరిశీలించారు.
Southern Railway : నాందేడ్లోనూ..
నాందేడ్ (Nanded) డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ లక్ష్మణరావు కమ్లేతో కలిసి నాందేడ్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు జీఎం. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్‌లో లభ్యమయ్యే సదుపాయాలను పరిశీలించారు.
అనంతరం డీఆర్‌ఎం(DRM)తో పాటు ఇతర సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్లో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పర్యటనలో జీఎంకు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కూలీలు కలసి వారి సమస్యలు వినిపించుకున్నారు.