ePaper
More
    Homeటెక్నాలజీMahindra BE 6 | 135 సెకండ్లలో 999 కార్ల విక్రయాలు.. సంచలనం సృష్టించిన మహీంద్ర...

    Mahindra BE 6 | 135 సెకండ్లలో 999 కార్ల విక్రయాలు.. సంచలనం సృష్టించిన మహీంద్ర బీఈ 6

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mahindra BE 6 | కార్ల విక్రయాల్లో మహీంద్రా & మహీంద్రా సంచలనం సృష్టించింది. ఆ సంస్థ తీసుకొచ్చిన కొత్త మాడల్ కారు (new model car) నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి.

    కేవలం 135 సెకన్లలో 999 కార్ల బుకింగ్(car bookings)లు పూర్తయ్యాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహీంద్ర BE 6 బ్యాట్మ్యాన్ కలెక్టర్ ఎడిషన్ (Mahindra BE 6 Batman Collector Edition)ను లాంచ్ చేసింది.

    దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ల స్వీకరణను ప్రారంభించింది. తొలుత 300 యూనిట్లు విక్రయించాలని లక్ష్యం పెట్టుకోగా.. కొనుగోలుదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది.

    దీంతో కార్ల సంఖ్యను 999 కి పెంచింది. అయితే, బుకింగ్ ప్రారంభమైన 135 సెకన్లలోనే మొత్తం కార్లు అమ్ముడుపోయాయని మహీంద్ర ప్రకటించింది.

    Mahindra BE 6 | ఆకట్టుకునే డిజైన్..

    వార్నర్ బ్రదర్స్ (Warner Bros) డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తో మహీంద్రా తీసుకొచ్చిన BE 6 బ్యాట్​మన్​ ఎడిషన్ ఇది. సినిమాటిక్ వారసత్వాన్ని అత్యాధునిక EV డిజైన్, మెరుగైన పనితీరుతో చూడగానే ఆకట్టుకుంటోంది.

    ది డార్క్ నైట్ ట్రైలజీ నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేక కలెక్టర్ మోడల్ BE 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). సెప్టెంబరు 20 నుంచి ఈ లిమిటెడ్-ఎడిషన్ SUV (limited-edition SUV) వాహనాల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

    Mahindra BE 6 | ప్రత్యేకతలెన్నో..

    ప్యాక్ త్రీ ఆధారంగా రూపొందించబడిన బ్యాట్​మన్​ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్​ను కలిగి ఉంది. ఆల్కెమీ గోల్డ్-పెయింటెడ్ సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్లతో అందంగా తీర్చిదిద్దారు.

    హబ్ క్యాప్​లపై ఉంచిన బ్యాట్ సింబల్, ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్లు, వెనుక బంపర్, విండోస్, వెనుక విండ్షీల్డ్, ఇన్ఫినిటీ రూఫ్ ప్రొజెక్షన్, “BE 6 × ది డార్క్ నైట్” (BE 6 × The Dark Knight) వెనుక బ్యాడ్జింగ్​తో పాటు ఎన్నో విలక్షణలు ఉన్నాయి.

    డోర్లపై సిగ్నేచర్ బ్యాట్​మన్​ డెకాల్, R20 అల్లాయ్ వీల్స్, బ్యాట్ లోగోను ప్రొజెక్ట్ చేసే కార్పెట్ ల్యాంప్​లు మరింత ఆకట్టుకుంటున్నాయి.

    లోపల క్యాబిన్ చార్కోల్ లెదర్, స్వెడ్ అప్హోల్స్ రీలో సెపియా గోల్డ్ యాస స్టిచింగ్​తో తీర్చిదిద్దారు. డాష్​బోర్డుపై నంబరింగ్ తో కూడిన బ్యాట్​మన్​ ఎడిషన్ ప్లేక్ చూడటానికి ఎంతో అందంగా ఉంది.

    గోల్డ్ యాక్సెంటెడ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (electronic parking brake, కస్టమ్ కీ ఫోబ్, బ్యాట్​మన్​ – ఎంబోస్డ్ బూస్ట్ బటన్, హెడ్రెస్ట్ ల వంటి ప్రీమియం వసతులు మంచి అనుభూతిని కలిగిస్తాయి.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...