ePaper
More
    HomeజాతీయంSpecial Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వినాయక చవితికి 380 ప్రత్యేక రైళ్లు

    Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వినాయక చవితికి 380 ప్రత్యేక రైళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Special Trains | ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్లో రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను (special trains) నడపనున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా రికార్డు స్థాయిలో 380 గణపతి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. పండుగ సీజన్లలో ప్రకటించిన సర్వీసులలో ఇదే అత్యధికం. భక్తులు, ప్రయాణికులు (devotees and passengers) తమ స్వస్థలాలకు, తీర్థయాత్రలకు వెళ్లడానికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి గాను స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

    Special Trains | ఏటేటా పెరుగుదల..

    గత కొన్ని సంవత్సరాలుగా గణపతి పండుగకు (Ganapati festival) స్పెషల్స్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023లో రైల్వేలు 305 స్పెషల్ ట్రైన్లను నడుపగా, 2024లో ఈ సంఖ్య 358కి పెరిగింది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకల (Ganesh Chaturthi celebrations) సందర్భంగా పెరుగుతున్న ప్రయాణ డిమాండ్​ను తీర్చడానికి 380 రైళ్లను నడుపనుంది.

    Special Trains | సెంట్రల్ రైల్వేలోనే ఎక్కువ

    మహారాష్ట్ర, కొంకణ్ బెల్ట్​లో అత్యధికంగా ఉండే ప్రయాణికుల డిమాండ్​ను తీర్చడానికి సెంట్రల్ రైల్వే అధికంగా సర్వీసులు నడపనుంది. సెంట్రల్ రైల్వే (Central Railway) పరిధిలో 296 ట్రిప్పులు షెడ్యూల్ చేశారు. పశ్చిమ రైల్వే 56 ట్రిప్పులు, కొంకణ్ రైల్వే (KRCL) 6 ట్రిప్పులు నడుపుతుంది. ఈస్టర్న్ రైల్వే 22 ట్రిప్పులను అదనంగా తిప్పనుంది.

    Special Trains | ప్రారంభమైన బుకింగ్​లు

    ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు బుకింగ్​లు ప్రారంభమయ్యాయి. పండుగ సమీపిస్తున్న కొద్దీ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నారు. స్పెషల్ ట్రైన్ల సమాచారం, హాల్ట్ కు సంబంధించిన వివరాలన్నీ IRCTC వెబ్​సైట్​, రైల్​ వన్ యాప్, కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయి.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this