ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | సీపీ ఎదుట 13 మంది బైండోవర్

    CP Sai Chaitanya | సీపీ ఎదుట 13 మంది బైండోవర్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా అదనపు మెజిస్ట్రేట్ (Additional District Magistrate) అయిన సీపీ సాయిచైతన్య ఎదుట శనివారం 13 మందిని బైండోవర్​ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ (Nizamabad Police Commissionerate) పరిధిలో రాబోయే గణేష్ విగ్రహాల నిమజ్జనం (Ganesh Nimajjanam), మిలాద్-ఉన్​-నబి (Milad-un-Nabi), దుర్గామాత (Navaratri Celebrations) ఉత్సవాలు ఉన్నందున సీపీ సాయి చైతన్య ఎదుట పోలీసులు 13 మందిని బైండోవర్​ చేశారు.

    డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్, బోధన్ డివిజన్ పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న 13 మందితో సీపీ వేర్వేరుగా మాట్లాడారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించారు. డీజే యజమానులకు రూ.2లక్షలు, ట్రబుల్ మాంగర్స్​కు (Troublemakers) రూ. లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50వేలు సొంత పూచీకత్తుపై అదనపు మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్​ చేశారు. మళ్లీ నేరాలకు పాల్పడినట్లయితే పూచీకత్తు కోసం జమచేసిన డబ్బును జప్తు చేస్తామని.. జైలుశిక్ష విధించబడుతుందని ఆయన హెచ్చరించారు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో రెండు కేసులు, బోధన్​ రూరల్ పీఎస్​లో 5, ఎడపల్లి పోలీస్ స్టేషన్​లో 3 కేసులు, రుద్రూర్ పోలీస్ స్టేషన్​లో 3 కేసుల్లో నిందితులను బైండోవర్​ చేశారు.

    More like this

    Nizamabad | పబ్లిక్ ప్రాసిక్యూటర్లలను సన్మానించిన సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP...

    Central Cabinet | కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం.. మినరల్​ రీసైక్లింగ్​కు భారీగా నిధులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Central Cabinet | కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్రిటికల్...

    CM Revanth Reddy Tour | సీఎం పర్యటన రూట్​మ్యాప్ పరిశీలన

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy Tour | సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు....