అక్షరటుడే, కామారెడ్డి: Mahalaxmi Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు (Free Bus) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ప్రయాణించారు.
కాగా.. ఈ ఉచిత బస్సు పథకం మాకొద్దంటూ కొందరు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి బస్టాండ్ (kamareddy Busstand) వద్ద శనివారం మహిళలు ఆందోళన నిర్వహించారు. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Mahalaxmi Scheme | రద్దీతో మహిళలకే ఇబ్బంది..
ఈ సందర్భంగా ‘‘ఈ పథకం మాకు వద్దు.. ఈ కాంగ్రెస్ పాలన వద్దని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. పథకం వచ్చినప్పటి నుంచి మహిళలకు బస్సుల్లో సీట్లు దొరకట్లేదని.. దీంతో అవస్థల పాలవుతున్నామని వారు వాపోయారు.
ఈ పథకంతో ప్రతిరోజు మహిళలు బస్సుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్రీ బస్సు పథకం ఎత్తివేసి ఆ డబ్బులను విద్యార్థులకు, వైద్యం కోసం ఖర్చు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఫ్రీబస్సు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు.