ePaper
More
    HomeFeaturesDangerous Stunts | రీల్స్​ కోసం ఫ్లై ఓవర్​ పైనుంచి దూకాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

    Dangerous Stunts | రీల్స్​ కోసం ఫ్లై ఓవర్​ పైనుంచి దూకాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dangerous Stunts | ప్రస్తుతం చాలా మంది సోషల్​ మీడియా (Social Media)కు బానిసలుగా మారిపోయారు. ఏదో ఒకటి చేసి సోషల్​ మీడియాలో ఫేమస్​ కావాలని కొంతమంది యువకులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పిచ్చి పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

    ఇటీవల ఓ యువకుడు రైలు వెళ్తుండగా ట్రాక్​ (Railway Track)పై పడుకొని రీల్స్​చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో యువకుడు రీల్స్​ (Reels) కోసం ఏకంగా ఫ్లై ఓవర్​ పైనుంచి దూకేశాడు. సోషల్​ మీడియాలో వైరల్ కావాలని ఆ యువకుడు ఫ్లై ఓవర్​ నుంచి దూకాలని ప్లాన్​వేశాడు. చెత్త లోడ్​తో ఉన్న వ్యాన్​లో దూకాలని భావించాడు. ఈ మేరకు లారీని ఏర్పాటు చేసుకున్నాడు. ఫ్లై ఓవర్​పైకి ఎక్కి దూకాడు. అయితే మనోడి ప్లాన్​ బెడిసి కొట్టింది. చెత్త వ్యాన్​ ముందు వెళ్లడం.. మనోడు దూకడంలో కాస్త ఆలస్యం కావడంతో వాన్​లో కాకుండా కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు.

    Dangerous Stunts | ఇదేం పిచ్చి..

    తమ పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు భావిస్తే.. పలువురు యువకులు ప్రమాదకర విన్యాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సృజనాత్మకత, ఆవిష్కరణలు చేపట్టి దేశ అభివృద్ధిలో భాగం కావాల్సిన యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారిపోయారు. మిగతా దేశాల్లో యువకులు ఆవిష్కరణలు, స్టార్టప్​లు పెడుతుంటే మన దగ్గర మాత్రం చాలా మంది రీల్స్​ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. మరికొంత మంది ఫేమస్​ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. గతంలో సైతం పలువురు రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన విషయం తెలిసిందే. రీల్స్​ కోసం ఇలాంటి స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this