ePaper
More
    Homeఅంతర్జాతీయంISRO Chairman | 2035 నాటికి సొంత‌ అంత‌రిక్ష కేంద్రం.. ఇస్రో ఛైర్మ‌న్ నారాయ‌ణ‌న్ వెల్ల‌డి

    ISRO Chairman | 2035 నాటికి సొంత‌ అంత‌రిక్ష కేంద్రం.. ఇస్రో ఛైర్మ‌న్ నారాయ‌ణ‌న్ వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ISRO Chairman | అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో భార‌త్ దూసుకెళ్తోంద‌ని ఇస్రో చైర్మ‌న్ వి.నారాయ‌ణ‌న్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఇస్రో చేప‌ట్ట‌నున్న ప్ర‌యోగాల గురించి వివ‌రించారు. 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (Indian Space Station) ఉంటుందని తెలిపారు. మొదటి మాడ్యూల్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.

    ISRO Chairman | 2040 నాటికి చంద్రుడిపైకి..

    చంద్రుడిపైకి చేరుకునేందుకు ఇస్రో స‌న్నాహాలు చేస్తోంద‌ని నారాయ‌ణ‌న్ (ISRO Chairman Narayan) తెలిపారు. ప్రధాని మోదీ నెక్స్ట్ జనరేషన్ లాంచర్‌కు ఆమోదం తెలిపారని, 2040 నాటికి ఇండియా చంద్రునిపై కాలు మోపుతుంద‌న్నారు. 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచ అంతరిక్ష కార్యక్రమంతో సమానంగా ఉంటుందని చెప్పారు. “మనకు చంద్రయాన్-4 మిషన్ ఉంటుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ ఉంటుంది. 2035 నాటికి మనకు BAS అనే అంతరిక్ష కేంద్రం ఉంటుంది. 2028 నాటికి మొదటి మాడ్యూల్ అందుబాటులోకి వస్తుంది. ప్రధానమంత్రి NGLకు (నెక్స్ట్ జనరేషన్ లాంచర్) ఆమోదం తెలిపారు. 2040 నాటికి మ‌న శాస్త్రవేత్త‌ల‌ను చంద్రునిపైకి పంపించి సురక్షితంగా తిరిగి తీసుకురానున్నాం. తద్వారా 2040 నాటికి భారత అంతరిక్ష కార్యక్రమం ప్ర‌పంచంతో సమాన స్థాయిలో ఉంటుంది” అని ఆయన వివ‌రించారు.

    అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లి వ‌చ్చిన‌ శుభాంషు శుక్లాను నారాయణన్ ప్ర‌శంసించారు. గగన్‌యాత్రని చేప‌ట్ట‌డానికి ముందు ఎవరినైనా ISSకి పంపాలనేది ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆలోచన అని తెలిపారు. “మా గగన్‌యాత్రికులలో ఒకరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం ప్రధాన విజయాలలో ఒకటి. గగన్‌యాత్ర చేప‌ట్ట‌డానికి ముందు వారిలో ఒకరిని ISSకి పంపాలనేది ప్ర‌ధాని ఆలోచన. ఆయన దార్శనికత నేడు గొప్ప విజయానికి దారితీసింది. శుక్లా ISSకి వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చారు. అత‌డితో క‌లిపి నలుగురు శాస్త్రవేత్త‌లు గ‌గ‌న్‌యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్ల‌నున్నారు.” అని నారాయ‌ణ‌న్ తెలిపారు.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this