ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు!

    Local Body Elections | స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్​ వీడటం లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు.

    తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ​(Congress) ప్రకటించింది. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత కుల గణన (Caste Census) చేపట్టింది. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే వాటిపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ఆర్డినెన్స్​ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయాలని భావించింది. ఈ మేరకు ఆర్డినెన్స్​ను గవర్నర్​ ఆమోదం కోసం పంపగా.. ఆయన కూడా పెండింగ్​లో పెట్టారు. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్​లో ఉండడంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

    Local Body Elections | పార్టీపరంగా రిజర్వేషన్లు

    స్థానిక ఎనికల్లో రిజర్వేషన్​ బిల్లు, ఆర్డినెన్స్​కు ఆమోదం లభించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించే స్థానాల్లో 42శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్​ యోచిస్తున్నట్లు సమాచారం. తాము పార్టీ పరంగా రిజర్వేషన్​ ఇస్తే ఇతర పార్టీలు సైతం అదేదారిలో వస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది.

    Local Body Elections | పీఏసీ సమావేశంలో చర్చ

    గాంధీభవన్​లో శనివారం(నేడు) సాయంత్రం పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)​ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్​లో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రులు, కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ మీటింగ్​లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే నామినేటేడ్​ పోస్టులపై సైతం చర్చించనున్నారు. ఈ నెల 25న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీంతో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై నేడు చర్చించి మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Latest articles

    Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి పోతున్న ప‌సిడి ధ‌ర‌

    Gold Price on august 27 : మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం Gold ధ‌ర‌లు...

    Vinayaka Chavithi Pooja | వినాయక చవితి పూజా విధానం.. సమర్పించాల్సిన నైవేద్యాలివే, జపించాల్సిన మంత్రాలవే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vinayaka Chavithi Pooja | భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని,...

    August 27 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 27 Panchangam : తేదీ (DATE) – 27 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    More like this