Indalwai
Indalwai | పల్లెబాట పట్టిన విద్యుత్​శాఖ అధికారులు..సమస్యలపై రైతులతో సమావేశం..

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుత్ శాఖ అధికారులు సమస్యలు తెలుసుకునేందుకు పల్లెబాట పట్టారు. ఈ సందర్భంగా డిచ్​పల్లి(Dichpally) ట్రాన్స్​కో డీఈ రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఇందల్వాయి మండలంలోని చంద్రాయణ్​ పల్లి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు.

విద్యుత్ సమస్యలపై రైతులు, గ్రామస్థులతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఉంటే వెంటనే విద్యుత్​ అధికారులను సంప్రదించాలని సూచించారు.

Indalwai | రైతులు సొంతంగా విద్యుత్​ పనులు చేయవద్దు..

రైతుల సొంతంగా విద్యుత్ పనులు చేయవద్దని డీఈ సూచించారు. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని.. ఎట్టిపరిస్థితుల్లో సొంతంగా మరమ్మతులు చేయవద్దని సూచించారు. ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1912 (Toll Free) కాల్​చేసి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ సందీప్, ఏఎల్​ఎం ప్రవీణ్, గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్ నర్సయ్య, గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.