ePaper
More
    HomeతెలంగాణIndalwai | ఇందల్వాయిలో అగ్నిప్రమాదం.. దీపం అంటుకుని ఇల్లు దగ్ధం

    Indalwai | ఇందల్వాయిలో అగ్నిప్రమాదం.. దీపం అంటుకుని ఇల్లు దగ్ధం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | ఇందల్వాయిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం మండలంలోని సిర్నపల్లి (Sirnapally) గ్రామంలో చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మరకల రాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్​కు (Gulf) వెళ్లాడు. ఆయన భార్య శనివారం ఇంట్లో పూజ చేసిన అనంతరం దీపం వెలిగించింది. ఆమె ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లగా.. పనినిమిత్తం ఆమె బయటకు వెళ్లింది. ఈ క్రమంలో గాలికి దీపం పక్కనే ఉన్న పేపర్లకు అంటుకుని అగ్నికీలలు ఇళ్లంతా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే మంటలు పెంకుటిళ్లంతా వ్యాపించాయి.

    గమనించిన స్థానికులు ముందుగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక శాఖ సిబ్బందికి (Fire station) సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో మంటలు చెలరేగి పైకి వచ్చేంతవరకు ఎవరు గమనించలేదన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

    మంటలార్పుతున్న ఫైరింజన్​

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...