ePaper
More
    HomeసినిమాGovinda-Sunita Ahuja | విడాకుల దిశ‌గా మ‌రో సెల‌బ్రిటీ జంట‌.. 38 ఏళ్ల వైవాహిక బంధానికి...

    Govinda-Sunita Ahuja | విడాకుల దిశ‌గా మ‌రో సెల‌బ్రిటీ జంట‌.. 38 ఏళ్ల వైవాహిక బంధానికి బీట‌లు వారాయా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govinda-Sunita Ahuja | ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువ‌గా వింటున్నాం. కొత్తగా పెళ్లైన వారు విడాకులు తీసుకుంటుండ‌గా, ద‌శాబ్ధంకి పైగా క‌లిసి ఉన్న జంట‌లు కూడా బ్రేక‌ప్ చెప్పుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా(Senior Actor Govinda) మరియు ఆయన భార్య సునీతా అహుజా మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని తెలుస్తుంది.. 38 ఏళ్ల వైవాహిక బంధానికి బీట‌లు వారాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విడాకుల పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగానే, గోవిందా వర్గం నుంచి “అలాంటిదేం లేదు, సమస్యలు సద్దుమణిగాయి” అనే ప్రకటనలు రావడం గందరగోళాన్ని పెంచుతోంది.

    Govinda-Sunita Ahuja | నిజమెంత‌?

    విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2024 డిసెంబర్ 5న సునీతా అహుజా (Sunita Ahuja) ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు(Bandra Family Court)లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, సెక్షన్ 13 (1) కింద వ్యభిచారం, మానసిక మరియు శారీరక హింస, విడిచి ఉండటం వంటి కారణాలను ఆమె ప్రస్తావించారు. ఈ నేప‌థ్యంలో గోవిందాకు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ, ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ కారణంగా 2025 మేలో కోర్టు ఆయనకు షోకాజ్ నోటీసు(Show Cause Notice) జారీ చేసింది.

    జూన్ 2025 నుంచి కోర్టు ఆదేశాల మేరకు గోవిందా–సునీతాల మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. అయితే గోవిందా హాజరయ్యారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. సునీతా మాత్రం క్రమంగా విచారణలకు హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, గోవిందా తరఫు న్యాయవాది లలిత్ బింద్రా స్పందిస్తూ, “అలాంటి కేసే లేదు. ఈ విషయంలో ఎవరో పాత విషయాల్ని తిరగేస్తున్నారు. గణేశ్ చతుర్థికి గోవిందా–సునీతా ఇద్దరూ కలిసి కనిపిస్తారు అంటూ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీతా.. 12 ఏళ్లుగా నా పుట్టినరోజును ఒంటరిగానే జరుపుకుంటున్నా. మా మధ్య బంధం ఉండినా, గోవిందా బిజీగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడే ఆయన స్వభావం వల్లే మనస్పర్థలు ఏర్పడ్డాయి” అని చెప్పిన మాటలు ఇప్పుడూ వైరల్ అవుతున్నాయి. గోవిందా ఓ యువ మరాఠీ నటితో సన్నిహితంగా ఉన్నాడనే పుకార్లు గత కొంతకాలంగా బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సునీతా విడాకులు కోరుతున్నారని ఊహాగానాలు పెరిగాయి.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this