ePaper
More
    HomeతెలంగాణMoneylenders | వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు

    Moneylenders | వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Moneylenders | వడ్డీ వ్యాపారుల తీరుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీ(High Interest)కి అప్పులు ఇస్తూ పలువురు వ్యాపారులు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేపట్టారు.

    నిజామాబాద్ నగరం(Nizamabad City)లో చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రజలకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. మూడో టౌన్, నాలుగో టౌన్, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

    Moneylenders | పలు పత్రాలు స్వాధీనం

    తనిఖీల సమయంలో పోలీసులు ప్రామిసరీ నోట్లు(Promissory Notes), డాక్యుమెంట్లు, అప్పు తీసుకున్న వారు ఇచ్చిన చెక్కులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమంగా దాచి ఉంచిన నగదును కూడా ఈ సోదాలో పరిశీలిస్తున్నారు. వడ్డీ వ్యాపారులతో(Moneylenders) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలావరకు పేద మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఇటీవల కేసులు కూడా నమోదు చేశారు. దీంతో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ సౌత్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సురేష్ కుమార్, ఆయా ఠాణాల ఎస్​హెచ్​వోలు ​వో రఘుపతి, హరిబాబు, శ్రీకాంత్, గంగాధర్, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.

    Moneylenders | గతంలో సైతం

    ఉమ్మడి జిల్లాలో గతంలో సైతం పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేపట్టారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టి కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. మెండోరా పోలీస్​ స్టేషన్​లో పని చేస్తున్న కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీపీ సాయిచైతన్య జూన్​లో సస్పెండ్​ చేశారు.

    Latest articles

    Arjun Tendulkar Engagement | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జ‌రిగిందా.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన స‌చిన్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Arjun Tendulkar Engagement : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ Sachin Tendulkar త‌న‌యుడు, యువ...

    Gold Price on August 26 | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 26 : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ...

    Global Market Analysis | ట్రంప్‌ సుంకాల బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాటలో గ్లోబల్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global Market Analysis : యూఎస్‌ ప్రెసిడెంట్‌(US president) ట్రంప్‌ చైనాపై మరోసారి సుంకాలతో బెదిరింపులకు...

    August 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 26 Panchangam : తేదీ (DATE) – 26 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this