ePaper
More
    Homeభక్తిPolala Amavasya | బసవన్నకు పూజలు.. ఎడ్ల పొలాల అమావాస్య ప్రత్యేకత ఇదే!

    Polala Amavasya | బసవన్నకు పూజలు.. ఎడ్ల పొలాల అమావాస్య ప్రత్యేకత ఇదే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Polala Amavasya | శ్రావణ మాసం(Shravana masam)లో శుక్లపక్షంలో వచ్చే అమావాస్యకు ప్రాధాన్యత ఇంది. దీనిని పొలాల అమావాస్య(Polala amavasya)గా జరుపుకుంటారు. ఎడ్ల పొలాల అమావాస్యగానూ పిలుస్తారు. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌(Erstwhile Nizamabad), ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. పలుచోట్ల రైతులు పశువులకు కొత్త బట్టలు కుట్టిస్తారు. ఎడ్లను శుభ్రంగా కడిగి, రంగుల దుస్తులను కప్పి, అలంకరించి ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. శనివారం ఎడ్ల పొలాల అమావాస్య నేపథ్యంలో దీని విశిష్టత తెలుసుకుందామా..

    వ్యవసాయం(Agriculture)తో అవినాభావ సంబంధం ఉన్న ఎడ్లను రైతులు సంపదగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పొలాల అమావాస్య రోజున మట్టితో ఎడ్లు తయారు చేసుకుంటారు. మరికొందరు మట్టితో తయారుచేసిన ఎడ్లను కొనుగోలు చేసి తీసుకువచ్చి పీటల మీద పెట్టి పూలతో అలంకరిస్తారు. పిండి వంటలు చేసి, ఎడ్లకు నైవేధ్యంగా సమర్పిస్తారు. నిజమైన ఎడ్లు(Oxes) ఉన్న వారు వాటికి స్నానాలు చేయించి, అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత ఆ ఎద్దులను ఆలయం(Temple) చుట్టూ తిప్పుతారు. ఆ రోజు ఎడ్లతో ఎలాంటి పనులు చేయించరు. పూజ పూర్తయిన తర్వాత మహిళలు వాయనాలు ఇచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు, ఇంట్లో వాళ్లకు ఉన్న దోషాలు అన్నిపోతాయని చెబుతుంటారు. ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మలోచేసుకున్న పాపాలు సైతం పోతాయని నమ్ముతుంటారు.

    Polala Amavasya | వృషభ పూజ ఎందుకంటే..

    పొలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. అంధకాసురుడు(Andhakasura) అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందాడు. ఆ వరగర్వంతో దేవతలను వేధించేవాడు. ఓసారి పార్వతీదేవిని వేధించడానికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న శివుడు(Maha Shiva).. శ్రీ మహావిష్ణువు(Sri Maha Vishnu) సహకారంతో అంధకాసురిడిని వధించాడు. ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు నంది(Nandi).. ‘స్వామీ మహర్షి శిలాధుని పొలంలో ఆదివృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య. అందుకే ఆ రోజు వృషభ పూజ చేసిన భక్తుల అభీష్టాలు నెరవేరేలా ఆశీర్వదించండి’ అని కోరుకుంటాడు. అప్పటి నుంచి శ్రావణమాసం అమావాస్య రోజు బసవన్నకు పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this