ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | గాంధారిలో జోరుగా మొరం అక్రమ దందా..! రాత్రికి రాత్రే గుట్టలను తవ్వేస్తున్న వైనం..

    Gandhari | గాంధారిలో జోరుగా మొరం అక్రమ దందా..! రాత్రికి రాత్రే గుట్టలను తవ్వేస్తున్న వైనం..

    Published on

    అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలో మొరం అక్రమ దందా (Moram Dandha) జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే గుట్టలను తవ్వేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

    Gandhari | గాంధారి మండలంలో..

    గాంధారి మండలంలోని గుడిమెట్‌(Gudimet) శివారు ప్రాంతం, సదాశివనగర్‌ (Sadashivnagar) మండలం శివారు ప్రాంతంలో మొరం దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ఇక్కడి గుట్టలను తవ్వేస్తూ మొరం తరలించుకుపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వుతూ.. ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తున్నారు.

    మాఫియా రూ.లక్షల్లో సంపాదిస్తుండగా ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు అటువైపు దృష్టి పెట్టకపోవడంతో, అక్రమదందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమదందాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

    చర్యలు తీసుకుంటాం..

    – రేణుక చవాన్, తహశీల్దార్‌

    మొరం అక్రమ తవ్వకాల అంశం మా దృష్టికి రాలేదు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపి విచారణ చేపడతాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.

    Latest articles

    TikTok | భారత్​లోకి టిక్ టాక్..! కొందరికి అందుబాటులోకి వచ్చిన యాప్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TikTok | భారతదేశంలో నిషేధించిన చైనీస్ వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన టిక్టాక్ తిరిగి వస్తుందా? భద్రతా...

    IRCTC International Tours | రూ.65 వేలకు థాయ్​లాండ్​.. రూ. 45 వేలకు నేపాల్​.. ఐఆర్​సీటీసీ ఇంటర్నేషనల్​ టూర్​ ప్యాకేజీలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IRCTC International Tours : దేశీయ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల టూర్ ప్యాకేజీలను ఐఆర్​సీటీసీ (IRCTC)...

    Bangladesh team | ఆసియా కప్‎కు‎ బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన.. వచ్చే నెలలోనే పోరు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangladesh team : ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు (Bangladesh cricket team) సిద్ధం...

    Attempted murder | సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిపై హత్యాయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Attempted murder : సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు....

    More like this