అక్షరటుడే, ఇందూరు: Photographers and Videographers | నిజామాబాద్ (Nizamabad) ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం ఎన్నికలు (Rajiv Gandhi Auditorium) నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ, ఉపాధ్యక్షుడిగా సారిక్, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా రామరాజు విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమిష్టి కృషితో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారిని సభ్యులు సన్మానించారు.
ఎన్నికైన ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు