ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకే శిక్షణ

    CP Sai Chaitanya | సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకే శిక్షణ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: CP Sai Chaitanya | వీఐపీల భద్రతా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు వారికి ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సీపీ సాయిచైతన్య అన్నారు.

    నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పీఎస్‌వోలకు (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) (Personal Security Officer) శుక్రవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో (Police Command Control Hall) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వీఐపీల భద్రత నేపథ్యంలో సేవలు అందించే పీఎస్‌వోల పాత్ర కీలకమైందన్నారు. పీఎస్​వోల (PSO) నైపుణ్యాలను మెరుగుపర్చడం, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

    శిక్షణలో నేర్చుకున్న అంశాలు, నైపుణ్యం, అనుభవం వారి బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడతాయన్నారు. ప్రతి పీఎస్‌వో నైపుణ్యంతో, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు వెళ్లాలని సూచించారు.

    భవిష్యత్తు సేవలకు ఈ శిక్షణ మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. రెండురోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి పీఎస్‌వో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఏఆర్‌ డీసీపీ రామచంద్ర రావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సతీష్, శేఖర్‌ బాబు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....