ePaper
More
    HomeతెలంగాణBhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    Bhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. సీఎస్​ఆర్ (CSR)​ నిధులతో త్వరలో మండలానికో అంబులెన్స్​ సమకూరుస్తామని ఆయన తెలిపారు.

    యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (Yadadri Thermal Power Plant) కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. మొత్తం 360 మందికి శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హైదరాబాద్​లో నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలతో పేదరికాన్ని జయించవచ్చని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.

    Bhatti Vikramarka | అంతర్జాతీయ ప్రమాణాలతో..

    రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్​ ఇండియా స్కూల్స్ (Young India Schools)​ నిర్మిస్తున్నట్లు భట్టి తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని మండలాలకు అంబులెన్స్​లు లేవని భట్టి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సీఎస్​ఆర్​ నిధులతో త్వరలో మండలానికో అంబులెన్స్​ అందిస్తామన్నారు.

    Bhatti Vikramarka | కరెంట్​ ఉండదని ప్రచారం చేశారు

    కాంగ్రెస్​ (Congress) అధికారంలోకి వస్తే కరెంట్​ ఉండదని ప్రచారం చేశారని భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. కరెంట్​ పోకుండా చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్​ అంటేనే కరెంట్​ అని.. కరెంట్​ అంటేనే కాంగ్రెస్​ అని ఆయన అన్నారు. రైతులకు, 200లోపు యూనిట్లు వాడుతున్న ఇళ్లకు ఉచిత విద్యుత్​ అందిస్తున్నట్లు వివరించారు. జనవరి వరకు యాదాద్రి పవర్​ప్లాంట్​ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అంకితం చేస్తామన్నారు.

    Bhatti Vikramarka | వాళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు

    పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ (BRS)​ ఉద్యోగాలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్​ఎస్​ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ పనితీరును చూసి బీఆర్​ఎస్​ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this