Sri Chaitanya School
Sri Chaitanya School | శ్రీచైతన్య పాఠశాలకు నోటీసులు జారీ

అక్షరటుడే, ఆర్మూర్ : Sri Chaitanya School | పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలకు (Sri Chaitanya School) ఎంఈవో రాజగంగారాం నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి పాఠశాల డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు (Education Department) ఫిర్యాదులు అందాయి. దీంతో ఎంఈవో రాజగంగారాం (MEO Rajagangaram) స్కూల్​లో విచారణ చేపట్టారు. అనంతరం శుక్రవారం పాఠశాలకు నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు టీసీలు జారీ చేసేందుకు ఏ పాఠశాలనైనా డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజుల కోసం కూడా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత పాఠశాలలపై చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు.