అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పోలీస్‌శాఖ (Police department) వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీపీ కార్యాలయంలో (CP office) గురువారం ఐఎంఏ సభ్యులతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సమావేశం నిర్వహించారు.
Nizamabad Traffic Police | అమల్లోకి వన్‌వే నిబంధన..
సీపీ సాయిచైతన్య సమావేశం నిర్వహించిన మరుసటి రోజే ఖలీల్వాడిలో ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ (Traffic ACP Mastan Ali) ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Inspector Prasad ) తన సిబ్బందితో రంగంలోకి దిగారు. అత్యంత రద్దీ ప్రాంతమైన ఖలీల్వాడిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.
Nizamabad Traffic Police | ఖలీల్‌వాడి.. ముదిరాజ్ గల్లీలో..
జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ గల్లి (Mudiraj Gally), ఖలీల్వాడిలో (Khaleelwadi) అత్యధికంగా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే చాలా ఆస్పత్రులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోగుల కోసం వచ్చే వారు.. ఇతరులు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో తరచూ ఖలీల్వాడిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సీపీ ప్రణాళిక రచించారు.
Nizamabad Traffic Police | రద్దీ ప్రాంతాల్లో వన్‌వే…
పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధికంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను వన్‌వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖలీల్వాడిలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఇతర సిబ్బంది వన్‌వేను ఏర్పాటు చేశారు. పలు కూడళ్ల వద్ద కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
Nizamabad Traffic Police | వన్‌వే ప్రాంతాలివే..
చెన్నయ్ షాపింగ్ మాల్ (Chennai shopping mall) ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium) వరకు వన్‌వే చేశారు. అలాగే ముదిరాజ్ హనుమాన్ ఆలయం నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు.. ఎస్ఎస్ఆర్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు వన్‌వే (One way) చేశారు. దీంతో వాహనదారులు ఈ ప్రాంతాలపై అవగాహనతో రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. వన్‌వే చేసిన అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఖలీల్ వాడి, రాష్ట్రపతి రోడ్, ముదిరాజ్ వీధిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఖలీల్వాడీలో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రసాద్